అక్టోబర్‌ 2 నుంచి దేవర 2!

భారీ అంచనాల మధ్య వచ్చిన ‘దేవర’ సినిమా బాక్సాఫీస్ ఇంకా దండయాత్ర చేస్తూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు మాత్రం భారీ కలెక్షన్స్ అందుకున్నాయి. ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’ మూవీ అటు ఓటీటీలో కూడా అద్భుతంగా రాణిస్తుంది. ఈ నేపథ్యంలో సీక్వెల్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే, ‘దేవర పార్ట్-2’ స్క్రిప్ట్ పనులు ప్రస్తుతం శరవేగంగా స్టార్ట్‌ అయ్యాయి. స్క్రీన్ ప్లే, కీలక సన్నివేశాలను ఆసక్తికరంగా మలిచేందుకు డైరెక్టర్ కొరటాల శివ, తన టీమ్‌ తో గత కొన్ని వారాలుగా వర్క్ మొదలు పెట్టారు.

అయితే, ఈ ఏడాది అక్టోబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలు కాబోతుందని రూమర్స్ వినపడుతున్నాయి. ఇంకా ఎలాంటి అధికారిక అప్ డేట్ రానప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త వైరల్‌ గా మారింది. కాగా ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా యాక్ట్‌ చేసింది. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషించారు. అనిరుధ్ మ్యూజిక్ అందించారు. తాజాగా ‘వార్-2’ షూటింగ్ పూర్తిచేసుకున్న ఎన్టీఆర్, ప్రస్తుతం ప్రశాంత్ నీల్‌తో చేసే సినిమాపై తన దృష్టి పెట్టారు.

Related Posts

Comments

spot_img

Recent Stories