టాలీవుడ్ ముద్దుగుమ్మ రష్మిక నిత్యం అభిమానులతో టచ్ లో ఉంటుందనే సంగతి తెలిసిందే. తన పర్సనల్ లైఫ్ గురించి ఎప్పటికప్పుడు అభిమానులతో పలు విషయాలను షేర్ చేసుకుంటు ఉంటుంది. ఆమె సోషల్ మీడియాలో ఏది పోస్ట్ చేసినా అభిమానులు కచ్చితంగా దానిని ఫాలో అవుతుంటారు.
అయితే, ఆమె తాజాగా ”డియర్ కామ్రేడ్” మూవీ గురించి ఓ పోస్ట్ చేసింది. విజయ్ దేవరకొండ, రష్మిక కాంబోలో వచ్చిన ఈ సినిమా 2019లో విడుదల అయిన సంగతి తెలిసిందే. నేటికి ఈ సినిమా వచ్చి 5 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా తన అనుభవాలను పంచుకుంది. ‘డియర్ కామ్రేడ్’ కథను విన్న దగ్గర్నుంచి ఆ సినిమాకోసం క్రికెట్ ఆటను నేర్చుకోవడం, షూటింగ్ లో పాల్గొనడం వరకు చాలా కష్టపడ్డామని..సినిమా పూర్తయినప్పుడు అయితే ఏదో తెలియని బాధ.. విడుదల సందర్భంగా అభిమానులతో కలిసి ఆడిపాడటం.. రిజల్ట్ ఏదైనా 5 సంవత్సరాలుగా తనపై ప్రేమను కురిపిస్తున్న అభిమానులకు రుణపడి ఉంటానని రష్మిక చెప్పుకొచ్చింది.
ఇక ఈ సినిమాలోని తన పాత్ర ‘లిల్లీ’గానే చాలా మంది తనను ఇంకా పిలుస్తుండటం తనకు ఎంతో ప్రత్యేకం అంటూ ఆమె చెప్పుకొచ్చింది