పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ఓజి సినిమా మీద ఫిల్మ్ సర్కిల్స్ లో హైప్ రోజురోజుకు పెరుగుతూనే ఉంది. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్‌తోనే ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ చిత్రం, పవన్ కెరీర్‌లోనే ఓ బిగ్ గేమ్ చెంజర్ అవుతుందన్న బజ్ వినిపిస్తోంది.
ఇక తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా నుంచి ఇంకో పవర్‌ఫుల్ టీజర్ రాబోతుందన్న టాక్ ఫిలింనగర్ లో జోరుగా వినిపిస్తోంది. ఆగస్ట్ 15న ఈ కొత్త టీజర్ రిలీజ్ చేసేందుకు టీమ్ ప్లాన్ చేస్తోందని సమాచారం. ఇప్పటికే విడుదలైన కంటెంట్ సినిమా మీద భారీ క్రేజ్ తెచ్చిందంటే, కొత్త టీజర్‌తో ఇంకోసారి ఊహించని రేంజ్ లో ఓజి హైప్ పెరగడం ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే ఈ ఒక్క సినిమాతో 300 కోట్లకిపైగా బిజినెస్ జరగడంతో, వచ్చే కంటెంట్ ఇంకా బలంగా ఉంటే, రిలీజ్ రోజే రికార్డు బ్రేకింగ్ ఓపెనింగ్స్ అందుకోవడం తథ్యం అంటున్నారు ట్రేడ్ వర్గాలు. మొత్తానికి ఓజి సినిమా మీద మళ్లీ ఇంట్రెస్ట్ పెంచే విధంగా మేకర్స్ స్ట్రాటజీ ప్లాన్ చేస్తున్నారన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.