షూటింగ్‌ లో ఫుల్ బిజీగా ఉన్న డార్లింగ్‌!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. మారుతి దర్శకత్వంలో హారర్ కామెడీ జానర్‌లో తెరకెక్కుతున్న ది రాజా సాబ్ చిత్రంతో పాటు, హను రాఘవపూడి డైరెక్షన్‌లో పీరియడ్ లవ్ స్టోరీ ఫౌజీ కూడా ఆయన చేస్తుండటం తెలిసిందే. ఈ రెండు సినిమాల్లో ముఖ్యంగా ది రాజా సాబ్ షూటింగ్ గురించి తాజా సమాచారం బయటకు వచ్చింది.

ఆగస్టు 25న హైదరాబాద్‌లోని అజీజ్ నగర్‌లో ఈ సినిమా షూట్ మళ్లీ మొదలైనట్టు తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌లో ప్రభాస్ కూడా పాల్గొంటున్నాడని సమాచారం. ప్రస్తుత షెడ్యూల్ పూర్తయిన తర్వాత సెప్టెంబర్ 17 నుంచి కేరళలో హీరో ఇంట్రొడక్షన్ సాంగ్ చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత గ్రీస్‌లో మరో రెండు పాటలను ఫిల్మ్ చేయాలని యూనిట్ నిర్ణయించిందని టాక్. ఈ ప్రోగ్రామ్ పూర్తి అయ్యాక సినిమా షూట్ మొత్తం దాదాపు ముగిసిపోతుందని ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి.

ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్‌లో ప్రభాస్ పాత్ర చాలా స్టైలిష్‌గా, పవర్‌ఫుల్‌గా కనిపించడంతో ఫ్యాన్స్‌లో అంచనాలు పెరిగాయి. ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటు సంజయ్ దత్, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ వంటి వారు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories