దళపతి విజయ్ స్టార్ పవర్…ఈ టాక్‌ తో భారీ వసూళ్లు ఖాయామే!

ఇళయ దళపతి విజయ్ హీరోగా నటించిన తన మోస్ట్‌ అవైటెడ్ లేటెస్ట్ సినిమా “ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం” గురించి అందరికీ తెలిసిందే. దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించిన ఈ భారీ యాక్షన్ డ్రామా సినిమా  మిక్స్డ్ టాక్ ని అందుకుంటుంది. అయితే ఈ టాక్ తో కూడా భారీ వసూళ్లు ఈ సినిమా నమోదు చేస్తున్నట్టుగా సమాచారం.

అయితే ఇదంతా ఓవర్సీస్ మార్కెట్ లో అట. విజయ్ సినిమాలకి ఓవర్సీస్ లో మంచి మార్కెట్ ఉంది. ఎన్నో దేశాల్లో తన సినిమాలు విడుదలై వరల్డ్ వైడ్ గ్రాస్ లో ఆ వసూళ్లు కూడా చాలా కీలక పాత్ర పోషిస్తాయి. ఇలా గత చిత్రం “లియో” కి రికార్డు వసూళ్లు నమోదు కాగా ఇప్పుడు ది గోట్ కి కూడా ఓవర్సీస్ మార్కెట్ నుంచి సెన్సేషనల్ స్టార్ట్ నమోదు అయిన విషయం తెలిసిందే.

ప్రపంచ వ్యాప్తంగా  డే 1 కి ఈ సినిమా 5 మిలియన్ డాలర్స్ కి పైగా గ్రాస్ ని నమోదు చేసినట్టుగా టాక్‌ వినిపిస్తుంది. దీంతో టాక్ తో సంబంధం లేకుండా ప్రీమియర్స్ డే 1 కలిపి దళపతి విజయ్ తన స్టార్ పవర్ ని చూపించాడు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా సంగీతం అందించగా ఏజీఎస్ సినిమాస్ వారు నిర్మాణం వహించారు.

Related Posts

Comments

spot_img

Recent Stories