అదిరిపోయే టీఆర్పీ అందుకున్న డాకూ మహారాజ్..!

టాలీవుడ్‌ నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా, శ్రద్ధా శ్రీనాథ్ కీలక పాత్రలో తెరకెక్కిన “డాకు మహారాజ్” సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. కొల్లి బాబీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం బాలయ్య కెరీర్‌లో మరో పెద్ద హిట్‌గా నిలిచింది. ఇక థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా తాజాగా టెలివిజన్‌పై ప్రేక్షకుల ముందుకొచ్చింది.

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రసారమైన “డాకు మహారాజ్” సినిమాకు స్మాల్ స్క్రీన్ ప్రేక్షకుల నుంచి కూడా మంచి స్పందన లభించింది. ప్రసారం అయిన రోజు ఈ సినిమాకు 8.23 టీఆర్పీ రేటింగ్ వచ్చిందని సమాచారం. ఈ మధ్యకాలంలో విడుదలైన పెద్ద సినిమాల రేటింగ్‌లతో పోల్చితే ఇది ఒక మెచ్చుకోదగ్గ స్థాయిలో ఉందని చెప్పవచ్చు.

ఈ సినిమాకు థమన్ సంగీతం అందించగా, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ప్రతినాయకుడిగా కనిపించాడు. కథ, సంగీతం, బాలయ్య ఎనర్జీ కలిసి ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో కీలక పాత్ర పోషించాయి. సితార ఎంటర్టైన్‌మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ కలిసి ఈ సినిమాను నిర్మించాయి.

మొత్తంగా చూసుకుంటే, థియేటర్లలో విజయం సాధించిన “డాకు మహారాజ్” టెలివిజన్ తెరపై కూడా అదే స్థాయిలో ఆదరణ పొందడంతో మేకర్స్ సంతోషంగా ఉన్నట్టు తెలుస్తోంది. బాలయ్య మార్క్ మాస్ యాక్షన్ ఇంకా టీవీ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నట్టు ఇది చూపిస్తోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories