షూటింగ్‌ లో గాయపడ్డ డకాయిట్‌ జంట!

టాలీవుడ్‌లో మరోసారి అడివి శేష్ మాస్ యాక్షన్ అవతారంలో కనిపించేందుకు రెడీ అవుతున్నారు. ఆయన నటిస్తున్న తాజా సినిమా ‘డకాయిట్’ ఇటీవల సినిమా లవర్స్‌ మధ్య మంచి హైప్ సొంతం చేసుకుంది. ఈ సినిమాకి షేనియెల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు. రన్ టైమ్ మొత్తం ఉత్కంఠ భరితంగా ఉండేలా పూర్తి యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.

ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకుంటున్న సమయంలో సెట్స్‌లో ఒక చిన్న ఘటన చోటుచేసుకుంది. యాక్షన్ సీన్లు తీస్తున్న సమయంలో అడివి శేష్‌తో పాటు హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌కు స్వల్ప గాయాలయ్యాయంటూ సమాచారం. అయినప్పటికీ వారు షూటింగ్ ఆపకుండా ఆ సన్నివేశాల్ని పూర్తి చేశారట. అనంతరం తగిన మెడికల్ ట్రీట్‌మెంట్ తీసుకున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.

ఈ చిత్రంలో డైరెక్టర్, నటుడు అనురాగ్ కశ్యప్ కూడా ఒక పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు. మ్యూజిక్ విషయంలో భీమ్స్ సిసిరోలియో ట్యూన్స్ అందిస్తున్నారు. ఇక డిసెంబర్‌లో క్రిస్మస్ స్పెషల్‌గా సినిమాను విడుదల చేయాలని యూనిట్ ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం సినిమా టీమ్ అన్ని పనులు వేగంగా పూర్తిచేస్తూ గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది.  

Related Posts

Comments

spot_img

Recent Stories