నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా దర్శకుడు బాబీ తెరకెక్కించిన సాలిడ్ హిట్ చిత్రం “డాకు మహారాజ్” కోసం అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు నడుమ ఈ సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం బాలయ్య కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ తర్వాత అంతా ఓటిటి రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూసారు. మరి ఫైనల్ గా సినిమా నేటి నుంచి దిగ్గజ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో వచ్చేసింది.
అయితే ఈ చిత్రం రిలీజ్ కి ముందు పలు రూమర్స్ ఉన్నాయి. సినిమా కేవలం ఒక్క భాషలోనే రాబోతుంది అని అలాగే నటి ఊర్వశి రౌటేలా సన్నివేశాలు కూడా తీసేసారు అంటూ పలు రూమర్స్ వైరల్ అయ్యాయి. కానీ వీటిలో నిజం లేదని తేలిపోయింది. ఈ సినిమా ఒక్క భాషలో కాదు పాన్ ఇండియా భాషల్లోనే నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చేసింది. అలాగే ఊర్వశి రౌటేలాపై కూడా సన్నివేశాలు ఉన్నాయి. సో ఆ రూమర్స్ లో ఎలాంటి నిజం లేదనే చెప్పవచ్చు. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందించగా సితార ఎంటర్టైన్మెంట్స్ అలాగే ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహించారు.