గ్లోబల్ స్థాయిలో గుర్తింపు పొందిన నటుడు రామ్ చరణ్‌కు లండన్‌లో మరో విశేషమైన గౌరవం లభించింది. ప్రపంచంలో ప్రముఖంగా పేరుగాంచిన మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ విగ్రహాన్ని రామ్ చరణే స్వయంగా ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమానికి మెగా ఫ్యామిలీ మొత్తం హాజరైంది. చిరంజీవి, సురేఖ, ఉపాసనతో కలిసి చరణ్ ఈ వేడుకలో పాల్గొన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆయనకు అంతర్జాతీయంగా విపరీతమైన గుర్తింపు వచ్చింది. దాంతో గ్లోబల్ ఫాలోయింగ్ కూడా భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన మైనపు విగ్రహాన్ని మేడమ్ టుస్సాడ్స్‌లో ఏర్పాటు చేయడం గర్వకారణం.
ఇప్పుడు చరణ్ మైనపు విగ్రహం ముందూ మెగా ఫ్యామిలీ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఫ్యాన్స్ ఈ ఫోటోల్ని షేర్ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.