హీరో తల్లి పాత్రలో మన్మథుడు హీరోయిన్‌!

మంచి మాస్ యాక్షన్ సినిమాలు చేయడంలో నక్కిన త్రినాథరావుకి మంచి నైవుణ్యం ఉంది. ఆయన నుంచి కొంత కాలం క్రితం వచ్చిన ‘ధమాకా’ సినిమా, వసూళ్ల పరంగా దూసుకెళ్లింది. ఆ తరువాత ప్రాజెక్టును సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిస్తున్నారు. ఈ పాటికే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వలన దీని చిత్రీకరణ ఆలస్యమైంది.

ఈ సినిమా కోసం ‘స్టిల్ బ్యాచ్ లర్’ .. ‘రేంజ్ మాస్టర్’ అనే టైటిల్స్ ను లైన్లో పెడుతున్నారు. అయితే ‘ధమాకా’ టైటిల్ సెంటిమెంట్ ను దృష్టిలో పెట్టుకుని ‘మజాకా’ అనే టైటిల్ ను దాదాపు ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్‌ గా రీతూ వర్మ మెరవనుంది.

ఈ సినిమాలో సందీప్ కిషన్ తండ్రిగా రావు రమేశ్ నటిస్తున్నాడు. ఇక హీరోకి తల్లిగా ‘మన్మథుడు’ బ్యూటీ అన్షూ కనిపించనుంది.  ‘మన్మథుడు’ సినిమాతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఆమె, ఈ సినిమాతోనే మరోసారి తెలుగు తెరకు రీ ఎంట్రీ ఇస్తోంది. 

Related Posts

Comments

spot_img

Recent Stories