ఆ డైరెక్టర్ పై విమర్శలు! టాలీవుడ్ వరుస హిట్ల తో సాలిడ్ హిట్ ట్రాక్ ని సొంతం చేస్తున్న కొంతమంది డైరెక్టర్లలో ప్రముఖ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన కూడా ఒకరు. నేను లోకల్, ధమాకా లాంటి మంచి ఎంటర్టైన్మెంట్ తో కూడిన సినిమాలు అందించిన తాను అపజయం అనేది అందుకోలేదు.
ఇలా తాజాగా యంగ్ హీరో సందీప్ కిషన్ తో “మజాకా” అనే సినిమాతో రాబోతున్నారు. అయితే సంక్రాంతికి కానుకగా ముందే టీజర్ ని ఓ ఈవెంట్ తో లాంచ్ చేశారు. అయితే ఈ టీజర్ బాగానే ఉంది కానీ ఈ ఈవెంట్ లో తన స్పీచ్ పై పలు విమర్శలు ఇపుడు సోషల్ మీడియాలో వినపడుతున్నాయి. మెయిన్ గా తన కామెంట్స్ యాంకర్ విషయంలో కానీ హీరోయిన్ అన్షు విషయంలో కానీ అభ్యంతరకరంగా ఉన్నాయంటూ విమర్శలు తనపై లేవనెత్తుతున్నాయి.
అలాగే వారి పైనే కాకుండా తన కామెంట్స్ కూడా కొన్ని కొంచెం ఎనర్జిటిక్ గానే ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో మాత్రం అమితంగా కూడా ఉన్నాయి అనిపిస్తుందని నెటిజన్లు అంటున్నారు. మెయిన్ గా హీరోయిన్ విషయంలో చేసిన కామెంట్స్ మాత్రం ఎక్కువ నెగిటివ్ గా వినపడుతున్నాయి.