అశ్వథ్థామునితో “కల్కి” సృష్టికర్త !

పాన్ ఇండియా యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబో లో చేసిన భారీ చిత్రం “కల్కి 2898 ఏడీ” గురించి అందరికీ తెలిసిందే. మరి రెబల్ స్టార్ ప్రభాస్ అలాగే దిగ్గజ తారలు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ ల కలయికలో వచ్చిన ఈ సినిమా ఇండియన్ సినిమా దగ్గర మరో హిస్టారికల్ హిట్ గా నిలిచి ఇప్పుడు బాక్సాఫీస్‌ వద్ద దూసుకుపోతుంది. మరి ఈ సక్సెస్ లో భాగంగా మూవీ మేకర్స్ ఒకో స్టార్ తో కలిసి ఇంట్రెస్టింగ్ వీడియో బైట్స్ షేర్‌ చేస్తున్నారు.

అలా తాజాగా తమ అశ్వథ్థాముడు బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ నుంచి కూడా ఓ ఇంట్రెస్టింగ్ వీడియోని మూవీ మేకర్స్ విడుదల చేశారు. తాజాగా అమితాబ్ తో ప్లాన్ చేసిన పాడ్ కాస్ట్ మధ్యలో అమితాబ్ దగ్గర కింద నాగ్ అశ్విన్ కూర్చుని ఇద్దరూ హ్యాపీగా నవ్వుకుంటూ మాట్లాడుతున్న పిక్ ఒకటి చిత్ర బృందం బయటకు వదిలింది.

ఈ పిక్‌ చూసేందుకు ఎంతో ప్లెజెంట్ గా కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. దీంతో ఈ స్పెషల్ పిక్ ఇప్పుడు అభిమానుల్లో వైరల్ గా మారింది. ఇక ఈ భారీ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా వైజయంతి మూవీస్ వారు నిర్మాణ బాధ్యతలు వహించారు.

Related Posts

Comments

spot_img

Recent Stories