గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా కలయికలో తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రం “పెద్ది” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా నుంచి రేపు రామ నవమి కానుకగా విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. మరి దీనికి మిక్సింగ్ సహా అన్ని పనులు పూర్తి చేసేసినట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేసేసారు.
అయితే ఈ గ్లింప్స్ లో ఒక క్రేజీ షాట్ కోసం నిర్మాత రవి శంకర్ చేసిన కామెంట్స్ ఇపుడు వైరల్ గా మారాయి. సినిమాలో ఒక లాంగ్ లెంగ్త్ షాట్ ఉందని ఆ ఒక్క షాట్ ని మాత్రం వెయ్యి సార్లు చూస్తారంటూ ఓ రేంజ్ హైప్ ఎక్కించారు. దీనితో రేపు వచ్చే గ్లింప్స్ ఏ లెవెల్లో ఉండబోతుందో అర్ధం చేసుకోవచ్చు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో ఈ చిత్రం రిలీజ్ కి రాబోతుంది.