“డాకు” తో క్రేజీ రికార్డు సెట్

నందమూరి నటసింహం బాలయ్య బాబు  హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కించిన తాజా మూవీ “డాకు మహారాజ్”. భారీ అంచనాలు నడుమ వచ్చిన ఈ మూవీ మాస్ ఆడియెన్స్ ని ఓ రేంజ్ లో అలరించి బాలయ్య కెరీర్ లో హైయెస్ట్ ఓపెనింగ్స్ ని సాధించింది. అయితే ఈ సినిమా ఇపుడు రికార్డు 100 కోట్లకి పైగా గ్రాస్ అందుకుంది.

అయితే ఈ సినిమాతో బాలయ్య మరో క్రేజీ ఫీట్ ని సెట్ చేసినట్టుగా సమాచారం. తాను “అఖండ” తో కం బ్యాక్ ఇచ్చిన తర్వాత అక్కడ నుంచి ఇపుడు డాకు మహారాజ్ వరకు వరుస నాలుగు 100 కోట్ల గ్రాస్ ని అందుకున్న సీనియర్ హీరోగా రికార్డు క్రియేట్‌ చేశారు. మన సీనియర్ స్టార్స్ లో ఈ ఫీట్ అయితే ఎవరికీ ఇప్పటి వరకు లేదు.

బాలయ్య బాబు ఇలా మొత్తానికి ఒక మాస్ రికార్డుని అందుకున్నారని చెప్పాలి. మరి డాకు మహారాజ్ తన గత సినిమాల కంటే వేగంగా కేవలం నాలుగు రోజుల్లోనే ఈ ఫీట్ ని అందుకున్నట్టుగా సమాచారం.

Related Posts

Comments

spot_img

Recent Stories