ఈమధ్య కాలంలో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడేలా చేసిన సినిమాల్లో ఒకటైంది “వార్ 2”. యాక్షన్ సినిమాలకు కొత్త హైప్ తీసుకొచ్చేలా, హృతిక్ రోషన్ – ఎన్టీఆర్ కలయికలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ‘బ్రహ్మాస్త్ర’ సినిమాతో పేరు సంపాదించిన దర్శకుడు అయాన్ ముఖర్జీ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ చూస్తే, ఇది ఒక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అనిపిస్తోంది. ఇటీవల రిలీజ్ చేసిన ఐమ్యాక్స్ పోస్టర్ అయితే స్పెషల్ గా ఉండటంతో, థియేటర్ అనుభవాన్ని ఐమ్యాక్స్ స్క్రీన్ మీద ఆస్వాదించాలనే ఆసక్తి అభిమానుల్లో మరింత పెరిగింది. ఎన్టీఆర్ – హృతిక్ మధ్య వచ్చే సీన్లు ఒక రేంజ్ లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.!
ఈ సినిమాలో కియారా అద్వానీ, హృతిక్ రోషన్ కు జోడీగా నటిస్తోంది. యష్ రాజ్ ఫిల్మ్స్ రూపొందిస్తున్న ఈ మూవీ, వారి స్పై యూనివర్స్ లో మరో కీలకమైన చాప్టర్ అని చెప్పొచ్చు. ఇప్పటికే టీజర్లు, పోస్టర్లతో బజ్ పెంచిన ఈ సినిమా ఆగస్ట్ 14న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
వార్ 2 పై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో, సినిమా థియేటర్లలో ఎలా రాణిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ఎన్టీఆర్ – హృతిక్ కాంబినేషన్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ లు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించనున్నట్లు ఫ్యాన్స్ భావిస్తున్నారు.