పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజి సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పూర్తిగా క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతుంది. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ఇందులో ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు.
ఇప్పటికే కొన్ని భాగాలు పవన్ లేకుండానే చిత్రీకరించారు. తాజాగా ఓ చిత్రీకరణ బృంద సభ్యుడు షేర్ చేసిన ఫొటో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈరోజు మళ్లీ షూటింగ్ మొదలైనట్టు ఆయన చెప్పాడు.
ఇక ఈ వారంలో పవన్ సెట్లో అడుగుపెట్టే అవకాశముంది. దీనితో పాటు పవన్, ఇమ్రాన్ హష్మీ మధ్య కీలక సన్నివేశాలు షూట్ చేయాల్సి ఉంది. అభిమానులు ఈ సన్నివేశాలపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, దీనిని డివివి ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్నారు. రిలీజ్ తేదీ కోసం అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.