తమిళ హీరో సూర్య కొత్త సినిమా మీద సినీ వర్గాల్లో మంచి ఆసక్తి నెలకొంది. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న వ్యక్తి వెంకీ అట్లూరి. ఇప్పటి వరకూ ప్రేమకథలతో పేరు తెచ్చుకున్న వెంకీ, ఈసారి సూర్యను పూర్తిగా కొత్త అవతారంలో చూపించేందుకు రెడీ అయ్యాడు. అందులో సూర్య పాత్రకు రెండు విభిన్న కోణాలు ఉన్నాయట. అదేవిధంగా, సూర్యలోని నెగటివ్ అంగ్లాన్ని కూడా తెరపై చూపించబోతున్నట్లు సమాచారం. పాత్రకు తగ్గట్టుగా స్పెషల్ లుక్ డిజైన్ చేయడం కోసం దర్శకుడు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాడట.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఒక భారీ యాక్షన్ సీన్‌ను చిత్రీకరిస్తుండగా, అదే సినిమా మొత్తానికి హైలైట్‌గా నిలుస్తుందని చిత్ర బృందం భావిస్తోంది. యాక్షన్ సీక్వెన్స్ అద్భుతంగా ఉండేందుకు అవసరమైన సాంకేతిక అంశాలన్నీ జత చేసి, గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు.
ఇక సంగీత దర్శకుడిగా జీవీ ప్రకాష్ ఈ సినిమాకు ట్యూన్లు అందిస్తున్నారు. ఆయన ప్రస్తుతం దర్శకుడు వెంకీ అట్లూరితో కలిసి మ్యూజిక్ పనుల్లో బిజీగా ఉన్నట్లు సమాచారం. ఇక హీరోయిన్ విషయంలో మొదట భాగ్యశ్రీ భోర్సే పేరు వినిపించినా, తరువాత కాయదు లోహర్ పేరే ఎక్కువగా చర్చలోకి వచ్చింది. ఫైనల్‌గా ఎవరు కథానాయికగా ఎంపికయ్యారనేది ఇంకా అధికారికంగా బయటపడలేదు.
ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్‌తో సూర్యకు మరో హిట్ పడుతుందా? వెంకీ అట్లూరి కాస్త వేరే జానర్‌ను టచ్ చేయడంలో ఎంతవరకు సక్సెస్ అవుతాడో అనేది ఆసక్తికరంగా మారింది.