డ్రాగన్‌ లో ఆ ప్రత్యేక పాటలో క్రేజీ ముద్దుగుమ్మ!

ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కాంబోలో రాబోతున్న సినిమా పై రోజుకొక రూమర్ వినపడుతున్న సంగతి తెలిసిందే. పైగా ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి వార్త వచ్చినా నెట్టింట వైరల్‌ గా మారుతుంది. ఈ క్రమంలోనే ఈ సినిమాలో మేకర్స్ ఓ స్పెషల్ సాంగ్ ను పెట్టేందుకు ప్లాన్‌ చేస్తున్నారంట. కాగా ఈ స్పెషల్ సాంగ్ ‌కి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వినపడుతుంది. ఈ మూవీలో క్రేజీ బ్యూటీ ‘ రష్మిక మందాన’ ఈ స్పెషల్ సాంగ్ ‌లో కనిపించనుందనే వార్త వినిపిస్తోంది. మరి ఈ వార్తలో ఎంత వాస్తవం ఉందో చూడాలి.

ఇక ఈ మూవీ టైటిల్ ‘డ్రాగన్‌’ అని ప్రచారంలో ఉంది. అయితే  ‘డ్రాగన్‌’ మూవీని ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా చేయాలని ప్రశాంత్ నీల్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. అందుకే, ఈ సినిమా స్క్రిప్ట్ కోసం ప్రశాంత్ నీల్ చాలా టైమ్ తీసుకున్నట్లు తెలుస్తుంది. కాబట్టి, ఇప్పటి వరకూ ప్రశాంత్ నీల్ తీసిన అన్ని సినిమాల్లోకల్లా బెస్ట్ సినిమా ఇదే అవుతుందని అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories