గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఇపుడు బుచ్చిబాబు సానా అలాగే సుకుమార్ ల కాంబోలో భారీ సినిమాలు తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అఫీషియల్ గా అయితే ఈ రెండే కనిపిస్తుండగా నెక్స్ట్ సినిమాలు ఏంటి ఎవరితో అనేవి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఈ సినిమాల్లో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో చేయనున్న సినిమా కూడా ఒకటని కొన్నాళ్ల నుంచి టాక్ వినపడుతున్న సంగతి తెలిసిందే.
మరి ఈ క్రేజీ కాంబినేషన్ పై ఇపుడు కొత్త బజ్ వినిపిస్తుంది. దీనితో ఈ చిత్రంని కన్నడ నిర్మాణ సంస్థ కే వి ఎన్ ప్రొడక్షన్స్ వారు టేకప్ చేయనున్నట్టుగా టాక్. వీరు ఆల్రెడీ లోకేష్ తో కొన్ని సినిమాలు సైన్ చేసుకోగా అందులో ఒకటి గ్లోబల్ స్టార్ తో కూడా ఉంటుంది అని తెలుస్తుంది.