అఖిల్‌ క్యారెక్టర్‌ పై క్రేజీ బజ్‌!

అక్కినేని యంగ్ హీరో అఖిల్ ప్రస్తుతం తన నెక్స్ట్ చిత్రాన్ని ‘లెనిన్’ సినిమాని దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి (నందు) డైరెక్షన్‌లో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్‌ ఇప్పటికే రిలీజ్ అయ్యి సినిమా పై అంచనాలను భారీగా పెంచేసింది. అయితే, ఈ సినిమాలో అఖిల్ పాత్ర గురించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ తెలుస్తోంది. అఖిల్ క్యారెక్టర్ లో రెండు షేడ్స్ ఉంటాయని.. ఈ షేడ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఇంటర్వెల్ లో ట్విస్ట్ కూడా ఉంటుందని తెలుస్తోంది.

కాగా ఈ సినిమా.. రాయలసీమ బ్యాక్‌ డ్రాప్‌ తో చిత్తూరు ప్రాంతం నేపథ్యంలో తెరకెక్కుతుంది. అఖిల్ మాడ్యులేషన్ కూడా పూర్తిగా చిత్తూరు యాసలోనే ఉండబోతుంది. ఇక ఈ సినిమాలో అందాల భామ శ్రీలీల హీరోయిన్‌గా నటించనుందట. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories