పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఒకేసారి ఎన్నో సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆయన హీరోగా తెరకెక్కుతున్న “ది రాజా సాబ్” అలాగే “ఫౌజీ” చిత్రాల షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. ఈ రెండు ప్రాజెక్ట్స్‌లో ప్రభాస్ పూర్తి భిన్నమైన షేడ్స్‌లో కనిపించబోతున్నాడని ఇప్పటికే టాక్ నడుస్తోంది. ఇవి పూర్తయిన తర్వాత ఆయన కొత్త సినిమా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో సెట్స్ పైకి వెళ్లనుంది.
ఈ చిత్రానికి “స్పిరిట్” అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇందులో ప్రభాస్ ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడని సమాచారం. అయితే, ఈ సినిమాకి సంబంధించిన ఒక క్రేజీ బజ్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రభాస్‌తో పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా ఇందులో కీలక పాత్రలో కనిపించే అవకాశం ఉందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
సందీప్ రెడ్డి వంగా సినిమాల్లో కేమియో రోల్స్‌కి ఎప్పుడూ ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. అందుకే ఆయన అభిమాన హీరో అయిన చిరంజీవి కోసం కూడా ఏదో ప్రత్యేకమైన పాత్రను రాసి ఉండవచ్చని అభిమానులు అంచనా వేస్తున్నారు. అయితే, చిరంజీవి ప్రస్తుతం వరుసగా తన ప్రాజెక్ట్స్‌లో బిజీగా ఉండటంతో ఈ వార్త ఎంతవరకు నిజం అన్నది ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది.