సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కూలీ’పై భారీ స్థాయిలో ఆసక్తి నెలకొంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా, పాన్ ఇండియా లెవెల్లో మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్స్‌లో ఒకటిగా మారింది. ప్రత్యేకంగా రజినీ–లోకేష్ కాంబినేషన్ అనగానే ఫ్యాన్స్ లో ఓ స్పెషల్ ఎగ్జైట్ కనిపిస్తోంది.
ఇప్పటికే యూఎస్ మార్కెట్‌లో ఈ సినిమాకి బుకింగ్స్ మొదలవ్వగానే మంచి స్పందన కనిపించింది. విడుదలకి ఇంకా నెలన్నర టైం ఉన్నా, ఈ చిత్రం ఇప్పటికే అక్కడ హాఫ్ మిలియన్ డాలర్ల గ్రాస్‌ను దాటి దూసుకెళ్తోంది. ఇది చూసిన ఫ్యాన్స్, ట్రేడ్ సర్కిల్స్ ఈ సినిమా మీద ఉన్న క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకుంటున్నారు.
ఇక ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కంపోజింగ్ చేస్తున్నాడు. గతంలో రజినీకాంత్ సినిమాల్లో ఆయన సంగీతం బిగ్ హిట్ అవ్వడం చూసినవారు, ఈసారి కూడా సౌండ్‌ట్రాక్ అద్భుతంగా ఉంటుందని ఆశిస్తున్నారు. ఈ సినిమాను సన్ పిక్చర్స్ ఎంతో భారీగా నిర్మిస్తోంది. మాస్ ఎలిమెంట్స్ తో పాటు స్టైలిష్ టేకింగ్ ఈ సినిమాకి హైలైట్ కానుంది.
ఆగస్ట్ 14న ఈ మూవీ అన్ని భాషల్లో థియేటర్లలోకి రావాల్సి ఉంది. రిలీజ్ కి ముందే ఈ స్థాయి బుకింగ్స్ రావడం చూస్తుంటే, రజినీకాంత్ మ్యాజిక్ ఇంకెంత బలంగా పనిచేస్తుందో చెప్పక్కర్లేదు. ‘కూలీ’ సినిమా యాక్షన్ లవర్స్ తో పాటు రజినీ అభిమానులకి పండుగలా మారే అవకాశం కనిపిస్తోంది.