తమిళ సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసిన “కూలీ” సినిమా చివరికి థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సూపర్ స్టార్ రజినీకాంత్‌తో పాటు కింగ్ నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర వంటి ప్రముఖ నటులు కలిసి నటించడంతో ఈ సినిమా విడుదలకు ముందు నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు లోకేష్ కనగరాజ్ రూపొందించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మొదటి రోజు మిశ్రమ స్పందన తెచ్చుకున్నా, వసూళ్ల పరంగా మాత్రం అద్భుతమైన ప్రారంభాన్ని నమోదు చేసింది.
మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా సుమారు 151 కోట్ల గ్రాస్ సాధించడం ద్వారా “కూలీ” తమిళ సినిమా చరిత్రలోనే తొలి 150 కోట్ల ఓపెనింగ్ కలిగిన చిత్రంగా నిలిచింది. ఈ రికార్డు రజినీకాంత్ స్థాయిని మరోసారి నిరూపించగా, అభిమానులు ఆయనను రికార్డులను మాత్రమే బద్దలు కొట్టే హీరో కాదు, కొత్త రికార్డులు సృష్టించే స్టార్‌గా మరింత గర్వంగా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు సినిమా రెండో రోజు నుంచి వసూళ్లు ఎలా కొనసాగుతాయో అందరి చూపు బాక్సాఫీస్‌పై పడింది.