ఫుల్‌ స్వింగ్‌ లో కూలీ సినిమా…అక్కడ కింగ్‌ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ!

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా యాక్ట్‌ చేస్తున్న తాజా చిత్రాల్లో “వేట్టైయన్” ఈ అక్టోబర్ లో విడుదలకి సిద్దంగా ఉంది. ఈ సినిమా తర్వాత మరో క్రేజీ ప్రాజెక్ట్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో “కూలీ” అనే సినిమా ని రజినీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం పై కూడా భారీ హైప్ ఏర్పడింది.

దర్శకుడు లోకేష్ కనగరాజ్ మార్క్ క్రేజీ తారాగణంతో సినిమాని నింపేయగా ఇందులో మన టాలీవుడ్ నుంచి కింగ్ నాగార్జున కూడా కీలక ఓ ముఖ్య పాత్ర చేస్తున్నట్లు డైరెక్టర్‌ తెలిపారు. ఇందులో నాగ్ సైమన్ అనే ఇంట్రెస్టింగ్ రోల్ చేస్తుండగా ఈ ఇప్పుడు నాజీ షూటింగ్ లో కీలక పాత్ర పోషిస్తూ బిజీగా ఉన్నారు.

 ప్రస్తుతం సినిమా షూటింగ్ వైజాగ్ లో జరుగుతుంది. ఇప్పుడు నాగ్ కూడా వైజాగ్ లోనే ఉండగా అభిమానులతో కొన్ని విజువల్స్ కూడా సోషల్‌ మీడియాలో ప్రత్యక్షం అయ్యాయి. మొత్తానికి అయితే నాగ్ ఈ భారీ సినిమాలో ఇప్పుడు బిజీగా ఉన్నారనే టాక్ నడుస్తుంది. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా సన్ పిక్చర్స్ వారు నిర్మాణ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.

Related Posts

Comments

spot_img

Recent Stories