‘సొంత వారికి బిల్లు’లపై కోర్టుకెళ్లనున్న కాంట్రాక్టర్లు!

అవసానదశలో కూడా దింపుడు కళ్లెం అప్పులాగా.. రిజర్వు బ్యాంకు నుంచి నాలుగువేల కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. వివిధ పథకాల కింద బటన్లు ఆల్రెడీ నొక్కబడిన వాటి యొక్క లబ్ధిదారులకు పోలింగ్ ముందురోజు వేయాలని అనుకున్న సొమ్ములు 14వేల కోట్ల పైచిలుకు ఉన్నాయి. ఫిబ్రవరి నుంచి రకరకాల పథకాలకు పంచవలసిన డబ్బును పెండింగుపెట్టి.. సరిగ్గా పోలింగ్ కు ముందు డబ్బు వేయడం ద్వారా.. అనుచిత లబ్ధి పొందాలని ప్రభుత్వం అనుకుంది. అయితే ఈసీ ఆ కుట్రకు బ్రేక్ వేసింది.పోలింగ్ తర్వాత ఇచ్చుకోవచ్చునని చెప్పింది.

పోలింగు ముగిసి రెండు రోజులు అవుతోంది… పథకాల లబ్ధిదారులకు నిధులు పంపిన దాఖలాలు కనిపించడం లేదు గానీ.. కొత్తగా సేకరించిన అప్పులతో కలిపి తమ సొంత మనుషులైన కాంట్రాక్టర్లకు వేల కోట్ల రూపాయల బిల్లులు చెల్లించేయడానికి కుట్ర జరుగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అధికారం నుంచి దిగిపోతున్నామని అర్థం కాగానే.. జగన్ ఇలాంటి కుట్రలకు తెరలేపడం గురించి చంద్రబాబునాయుడు గగ్గోలు పెడుతున్నారు. అయితే తాజాగా, విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. చాలాకాలంగా బిల్లులు రాకుండా పెండింగులో ఉన్న కాంట్రాక్టర్లు కొందరు కలిసి.. ముందు పనులు పూర్తిచేసిన వారికే ముందు బిల్లులు చెల్లించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.

జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత.. అదివరలో తెలుగుదేశం హయాంలో పూర్తిచేసిన అనేక పనులకు కూడా బిల్లులు చెల్లించకుండా మానేశారు. ఆ తర్వాత పనులు చేసిన వారికి కూడా సక్రమంగా బిల్లులు చెల్లించలేదు. తీరా ఇప్పుడు అధికారం నుంచి దిగిపోయే వాతావరణం ఉన్నట్టు అర్థం కాగానే.. హఠాత్తుగా తనకు కావాల్సిన కొందరికరి వేల కోట్ల బిల్లులు చెక్కులు ఇచ్చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా పుకార్లు వస్తున్నాయి.
అయితే కొందరు కాంట్రాక్టర్లు కలిసి కోర్టును ఆశ్రయించనున్నట్టు తెలుస్తోంది.

ముందు పనులు చేసిన వారికి ముందు బిల్లులుఇవ్వాలని, లేదా.. ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఈ బిల్లుల చెల్లింపు కుట్రను ఆపాలని వారు కోరబోతున్నట్టుగా తెలుస్తోంది. జగన్ సర్కారు పతనం కావడానికి ముందు తీసుకున్న చివరి నిర్ణయం  కాంట్రాక్టర్లకు దోచిపెట్టడమే. ఈ చివరి నిర్ణయం కూడా కోర్టు ద్వారా ఆగిపోయే వాతావరణం కనిపిస్తోంది. 

Related Posts

Comments

spot_img

Recent Stories