టీచర్లను వాలంటీర్లతో పోలుస్తారా? ఇంత ఘోరమా?

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయుల పట్ల అత్యంత అవమానకరంగా ప్రవర్తిస్తూ, వారి మీద పగబట్టినట్టుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తున్నదంటే అందుకు ప్రధాన కారణం పాఠశాల విద్య ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ అనే ఆరోపణలు ఉపాధ్యాయవర్గాల నుంచి సుదీర్ఘకాలంగా ఉన్నాయి. ఉపాధ్యాయులు పీఆర్సీ విషయంలో గానీ, పాత పెన్షన్ విధానంలోగానీ.. జగన్ సర్కారు మీద పోరాడిన నాటినుంచి ప్రభుత్వం వారి మీద పగబట్టింది. పగబట్టినట్టుగానే.. వారి చుట్టూ నిబంధనల ఉచ్చు బిగించి.. వారిని ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా వ్యవహరిస్తూ వచ్చారు. టీచర్లకు పనిభారాన్ని బీభత్సంగా పెంచారు. టీచర్లు అసలు పాఠాలు చెప్పాలో.. తమ చుట్టూ పెట్టిన నిబంధనల్ని అన్నింటినీ ఫాలో అవుతూ రోజంతా గడిపేయాలో అర్థం కాని పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో టీచర్లు అంటేనే చులకనగా మాట్లాడుతూ వచ్చిన ప్రవీణ్ ప్రకాశ్ తాజాగా తణుకులోని ఒక పాఠశాలను ఆయన పరిశీలించారు.

నిష్ణాతులైన టీచర్లున్నా పరీక్షల్లో నూరుశాతం ఫలితాలు రావడం లేదంటే.. టీచర్ల నిర్లక్ష్యమే కారణం అని ఆయన అంటున్నారు. కోట్లు ఖర్చు పెట్టి సౌకర్యాలు కల్పిస్తున్నా ఫలితాలు మెరుగుపడడం లేదని అన్నారు. తమ పార్టీ కాంట్రాక్టర్లు దోచుకోవడానికే కోట్లు ఖర్చు పెడుతున్నారనేది వాస్తవం. ఫలితాలకు సౌకర్యాలకు సంబంధం ఉండదని ఇంత పెద్ద అధికారి ఎప్పుడు తెలుసుకుంటారో?

ఆయన అహంకారపూరిత మాటలకు మరో నిదర్శనం ఏంటంటే.. ఒక వాలంటీర్లు 50 ఇళ్లను చూస్తోంటే.. ఒక వాలంటీరు 25 మంది పిల్లలను చూడలేడా అని అంటున్నారు. వాలంటీర్ల పనికి టీచర్ల పనికి అసలు పోల్చడం ఏంటని.. ఆయనకు అంతఘోరమైన పోలిక తెచ్చే  ఆలోచన ఎలా వచ్చిందోనని టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీకు జీతాలుగా ఇస్తున్నది ఉచిత సొమ్ము ప్రజలసొమ్ము అంటున్న ప్రవీణ్ ప్రకావ్.. అక్కడికేదో సొంత డబ్బు ఇస్తున్నంతగా రెచ్చిపోతున్నారని టీచర్లు అంటున్నారు.

నూరుశాతం ఫలితాలు అనేది .. పిల్లలతో కాపీ కొట్టిస్తే తప్ప సాధ్యం కాదనేది ఆయనకు తెలియని సంగతా? ఇప్పుడు వందల వేల కోట్ల రూపాయలు వైఎస్సార్ సీపీ ఎన్నికల్లో ఖర్చు పెట్టింది. 175 స్థానాలు గెలిచే అవకాశం లేదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే చెబుతున్నారు. మరి పార్టీ 100 శాతం సీట్లు గెలవకపోతే.. అది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతగానితనం అవుతుందా.. ప్రవీణ్ ప్రకాశ్ నిర్వచనం ప్రకారం అంతే కదా.. అని ప్రజలు అంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories