మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన 50వ సినిమా గా మహారాజ తెరకెక్కింది. ఈ తమిళ సినిమా తెలుగు లో కూడా దుమ్ము లేపింది. మొత్తానికి దర్శకుడు నిథిలన్ స్వామినాథన్ ప్రేక్షకుల ఊహకందని స్క్రీన్‌ప్లేతో ‘మహారాజ’ను తెరకెక్కించి, మంచి విజయాన్ని అందుకున్నాడు. అయితే తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో రజనీకాంత్ చెప్పిన విషయాలు వెల్లడించారు.
నిథిలన్ స్వామినాథన్ ఏం మాట్లాడారు అంటే… ‘మహారాజ’ సినిమా విడుదలైన తర్వాత జీవితంలో తొలిసారిగా రజనీకాంత్‌ను కలిసాను. తన అనుభవాల్ని పంచుకుంటూ.. ఇండస్ట్రీలో ఎలా నిలదొక్కుకోవాలన్న పాఠం గురించి చాలా చక్కగా చెప్పారు. మా చిత్రం గురించి చాలా సేపు నాతో మాట్లాడారు. అంత గొప్ప స్టార్ హీరో తనకు బాగా కావాల్సిన వాడిలా నన్ను ట్రీట్ చేయడం చూసి నేను ఆశ్చర్యపోయాను’ అంటూ నిథిలన్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.