పాన్ ఇండియా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పై బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ చేసిన విమర్శలపై దర్శకుడు నాగ్ అశ్విన్ సోషల్ మీడియా వేదికగా అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. ‘ఇక వెనక్కి వెళ్లకూడదు. నార్త్ – సౌత్, బాలీవుడ్ VS టాలీవుడ్ అంటూ ఏం లేదు. యునైటెడ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక్కటే. అర్షద్ కాస్త మెరుగ్గా మాట్లాడి ఉంటే బాగుండేది. అయినప్పటికీ., ఆయన పిల్లలకి బుజ్జి టాయ్స్ పంపిస్తున్నా.. ప్రతి ఒక్కరినీ గెలిచేందుకు కల్కి పార్ట్ – 2 కోసం కష్టపడి పనిచేస్తా’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు.
ఈ విషయంపై ఇదివరకే తాజాగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన మా మూవీ అసోసియేషన్ కూడా మండిపడింది. ఇందుకు సంబంధించి కూడా బహిరంగంగా ఓ లేఖను కూడా విడుదల చేసింది. మా మూవీ ప్రెసిడెంట్ అయిన మంచు విష్ణు ఇందులో భాగంగా.. మనమంతా యాక్టర్స్ ఫ్యామిలీకి చెందినవాళ్లమని.. ఒకరి గురించి ఇలా మాట్లాడటం సరికాదంటూ తెలిపాడు.
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన గ్లోబల్ స్టార్ ప్రభాస్ పై ఇలాంటి చీప్ కామెంట్ చేయడం తెలుగువారి మనోభావాలను దెబ్బతీసిందని ఆయన పేర్కొన్నారు. ఇంకోసారి ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకోవాలని విష్ణు అన్నాడు.