విడుదలకు వచ్చేస్తోంది!

విడుదలకు వచ్చేస్తోంది! మాలీవుడ్ నుంచి టోవినో థామస్ అలాగే కోలీవుడ్ నుంచి త్రిష హీరో హీరోయిన్స్ గా అఖిల్ బాయ్, అనాస్ ఖాన్ రచన డైరెక్షన్‌ లో రాజు మల్లియాత్, రాయ్ సీజే నిర్మాతలుగా తెరకెక్కి తాజాగా విడుదలకి వచ్చిన సినిమా “ఐడెంటిటీ”. మలయాళంలో విడుదలైన ఈ సినిమా రెండు వారాలలో 50 కోట్లకు పైగా వసూలు చేసి 2025 లో తొలి హిట్ సినిమాగా నిలిచింది. అయితే ఇప్పుడు తెలుగు ఆడియెన్స్ ని అలరించేందుకు రెడీ అయ్యింది.మూవీ మాక్స్ శ్రీనివాస్ మామిడాల సమర్పణలో శ్రీ వేదాక్షర మూవీస్ చింతపల్లి రామారావు గారు కలిసి ఈ చిత్రం తెలుగు రాష్ట్రాలలో విడుదల చేస్తున్నారు. తాజా సినిమా సరిపోదా శనివారం సెన్సేషన్ జేక్స్ బెజోయ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించగా అఖిల్ జార్జ్ సినిమాటోగ్రఫీ చేశారు. ఈ చిత్రానికి చామన్ చక్కో ఎడిటింగ్ చేశారు. ఆద్యంతం అనేక మలుపులు తిరుగుతూ ప్రేక్షకులకు ఉత్కంఠభరితంగా ప్రేక్షకులు కళ్లు అప్పగించి చూసే విధంగా యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఐడెంటిటీ ఈ నెల 24వ తేదిన తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసేందుకు రెడీగా ఉన్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories