కూలిన విజయసాయి కూతురి కబ్జాలు..!

అయిదేళ్లు అధికారంలో ఉన్నందుకు, విశాఖపట్నాన్ని రాష్ట్రానికి ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేస్తాం అని ప్రకటించినందుకు జగన్మోహన్ రెడ్డి దళాలు.. ఏ స్థాయిలో అక్కడ భూకబ్జాలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాయో రాష్ట్రం మొత్తానికి తెలుసు. అలాంటి విశాఖలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఒకప్పటి ఉత్తరాంధ్ర పార్టీ ఇన్చార్జి విజయసాయిరెడ్డి కూతురు నేహారెడ్డి సీఆర్‌జడ్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన అక్రమకట్టడాలను జీవీఎంసీ అధికారులు కూల్చేశారు. న్యాయస్థానం తీర్పు మేరకు భీమిలి తీరంలో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న అక్రమ నిర్మాణాలను కూల్చేయాలని తీర్పు చెప్పింది. దానికి అనుగుణంగానే అధికారులు కూల్చివేతలు చేపట్టారు. కాగా ఈ కూల్చివేతలకు ఎలాంటి ప్రతిఘటన కూడా ఎదురుకాలేదు. 

విశాఖ వ్యాప్తంగా అయిదేళ్లలో భూబకాసురుల్లాగా వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు. సామాన్య పౌరులు కూడా ఆ పార్టీ దందాలను చూసి అసహ్యించుకునే పరిస్థితి అక్కడ ఏర్పడింది. దాని పర్యవసానమే.. ఇవాళ కూల్చవేతలు జరుగుతోంటే.. తొలగింపు ప్రక్రియను ఎవరూ అడ్డుకోలేదని కూడా తెలుస్తోంది. భీమిలి తీరంలో విజయసాయిరెడ్డి కూతురు నేహారెడ్డి.. ఒక హోటల్ నిర్మాణం కోసం వేసిన కంక్రీట్ పిల్లర్స్, గోడలు, ఇతర నిర్మాణాలను తొలగిస్తున్నారు. ఇవన్నీ అక్రమ కట్టడాలే అని స్పష్టంగా తమకు కూడా తెలుసుగనుక.. కనీసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారు కూడా కనీసం నిరసన తెలియజేయడానికి అక్కడకు రాలేదేమో అనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తం అవుతోంది. 

ఈ అక్రమ నిర్మాణాలపై జనసేన కార్పొరేటర్ మూర్తియాదవ్ తోపాటు మరికొందరు కూటమి పార్టీల నాయకులు కోర్టుకు వెళ్లారు. విచారణ తర్వాత కూల్చివేతలకు ఉత్తర్వు వచ్చింది. కోర్టు చెప్పిన తర్వాత అధికారులు చేస్తున్న కూల్చివేతలను అడ్డుకుంటే తమ పరువే పోతుందని వైసీపీ వారు భయపడినట్టుగా కూడా కనిపిస్తోంది. 

పార్టీలో అంతర్గతంగా మరో వాదన కూడా వినిపిస్తోంది. విజయసాయిరెడ్డి విశాఖపట్నం నాయకుల మీద తాను పార్టీ ఇన్చార్జిగా ఉండగా.. అడ్డగోలుగా పెత్తనం చెలాయించారని.. ఇప్పుడు ఆయన కూతురు చేసిన నిర్మాణాలను కూల్చివేస్తుండడం చూసి వైసీపీ నాయకులు కూడా పండగ చేసుకుంటున్నారని.. ఆయన పట్ల ఆయన సొంత పార్టీలోనే అంత అసహ్యం పేరుకుని ఉందని, కూల్చివేతల పట్ల అయ్యో అనే దిక్కు కూడా లేదని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories