జగన్ ఫోబియాను భలే వాడుకుంటున్న కూటమినేతలు!

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతోకాలంగా రాజకీయాల్లో ఉన్నారు. ఎంపీగా చేశారు. ఒక తడవ ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. కానీ, ఆయనకు అనేక రకాల ఫోబియాలు ఉన్నాయి. ప్రధానంగా మీడియా అంటే ఫోబియా.. అందుకే ముఖ్యమంత్రి, లేదా పార్టీ అధ్యక్షుడు మీడియా ముందుకు రావాల్సిన సందర్భం అని అందరూ అనుకునే సమయంలో సజ్జల ను ముందుకు నెడతాడు. అలాగే అమరావతి అంటే ఫోబియా! అందుకే దానిని సర్వనాశనం చేసేయాలని కంకణం కట్టుకుని మరీ అ2యిదేళ్ల పాటు పనిచేశాడు. ప్రస్తుతం అసెంబ్లీ అంటే ఫోబియా. ఎమ్మెల్యేగా గెలిచినా కూడా అసెంబ్లీలో అడుగుపెట్టాలంటే వణికిపోతున్నాడు. ఇప్పుడు ఎన్డీయే కూటమి పార్టీల నాయకులు కూడా.. అచ్చంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో ఉన్న ఫోబియాను చక్కగా వాడుకుంటున్నారు. అసెంబ్లీ ఫోబియా కారణంగా ఏ పని చేయడానికి జగన్ జంకుతాడో, వెనక్కి తగ్గుతాడో.. ఆ పనిచేయమని పదేపదే సవాళ్లు విసురుతున్నారు.

కేవలం 11 మంది ఎమ్మెల్యేలను కలిగిఉన్న జగన్మోహన్ రెడ్డి తలకిందులుగా తపసు చేసినా కూడా.. కేబినెట్ హోదాతో సమానమైన ప్రతిపక్ష నేత పదవి ఆయనకు దక్కడం అనేది కల్ల. జరగదు! రాబోయే నాలుగేళ్లపాటు కూడా ఆయన అసెంబ్లీకి రావడం అనేది కూడా కల్ల.. జరిగేపని కాదు! డిప్యూటీ స్పీకరు రఘురామక్రిష్ణ రాజు బెదిరిస్తున్నట్టుగా.. వరుసగా గైర్హాజరైతే పదవిపోతుందనే భయం శృతిమించితే.. బహుశా 60 రోజులకు ఓసారి అసెంబ్లీకి వచ్చి అటెండెన్సు రిజిస్టరులో సంతకాలు చేసి జగన్ పారిపోవచ్చు గాక! ఎందుకంటే వరుసగా రాకపోతే పదవి పోతుందని జగన్ కు భయం. ఉప ఎన్నికలు వస్తే.. గతంలో వచ్చినన్ని సీట్లయినా తన పార్టీకి ఉంటాయో లేదోనని భయం. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ లోని భయంతో కూటమినేతలు ఆడుకుంటున్నారు.
ఆయన ఎక్కడ ఏ విమర్శ చేసినా సరే.. ‘దమ్ముంటే అసెంబ్లీకి రా.. అక్కడ తేల్చుకుందాం’.. ‘నువ్వు ఏ సమస్యనైనా లేవనెత్తు.. అసెంబ్లీలో దాని గురించి చర్చించుకుందాం రా.. అసెంబ్లీలో మేం సమాధానం చెప్తాం రా’ అని పిలుస్తున్నారు. పాపం వాళ్లు ఎన్ని సవాళ్లు విసురుతున్నా సరే.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం.. సావిత్రితో యమధర్మరాజు.. ‘ఏమైనా కోరుకో.. నీ పతిప్రాణంబు దక్క’ అన్నట్టుగా.. ‘ఆ ఒక్కటీ అడక్కు’ అన్నట్టుగా జగన్ వ్యవహరిస్తున్నారు.

మెడికల్ కాలేజీల విషయం జగన్ లేవనెత్తితే.. వైద్య మంత్రి సత్యకుమార్ యాదవ్.. అసెంబ్లీకి రా అన్ని వివరాలు చెబతాం అని సవాలు విసిరారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి జగన్ ఓర్వలేకపోతున్నారని, ఆయన అసెంబ్లీకి వస్తే.. అన్ని సందేహాలను సావధానంగా తెలియజెబుతామని మంత్రి గొట్టిపాటి రవి కూడా అంటున్నారు. వీరిద్దరు మాత్రమే కాదు.. కూటమిలోని ప్రతి నాయకుడు కూడా దమ్ముంటే అసెంబ్లీకి రా అని సవాళ్లు విసురుతుండడంతో జగన్ శిబిరం గందరగోళానికి గురవుతోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories