ఇదిలా ఉంటే, అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కుతోన్న ‘లెనిన్’ సినిమాకు సంబంధించిన తాజా అప్డేట్ బయటకు వచ్చింది. మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో, జూన్ మొదటి వారంలో క్లైమాక్స్ సన్నివేశాలను ఓ ప్రత్యేక సెట్లో చిత్రీకరించబోతున్నారు. ప్రత్యేకంగా డిజైన్ చేసిన స్టంట్స్ లో అఖిల్ పాల్గొనబోతున్నాడట.
ఆ తర్వాత ఓ పాటను కూడా షూట్ చేయనున్నట్టు సమాచారం. రాయలసీమ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా కోసం అఖిల్ తన డైలాగ్ డెలివరీని కూడా అక్కడి యాసతోనే మార్చుతున్నాడు. శ్రీలీల కథానాయికగా నటిస్తుండగా, దసరా సమయానికి విడుదల చేసే అవకాశాలున్నాయట.