ప్రస్తుతానికి పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో దర్శకుడు మారుతీతో చేస్తున్న ఇంట్రెస్టింగ్ హారర్ కామెడీ చిత్రం “ది రాజా సాబ్” కూడా ఒకటి. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ముందు టీజర్ పట్ల ఆసక్తి నెలకొంది.
అయితే ఈ మే మధ్యలోనే ఇది రానుందని మారుతీ కొంతకాలం క్రితం హింట్ ఇచ్చారు కానీ ఇపుడు వరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. ఇక ఫైనల్ గా అసలు టీజర్ ఉందా లేదా అనే విషయాన్ని మారుతీ సన్నిహితుడు నిర్మాత ఎస్ కె ఎన్ తాజాగా ఓ క్లారిటీ అయితే ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు.
మారుతీతో కొద్దిరోజుల క్రితం మాట్లాడ్డం జరిగింది అని ప్రస్తుతం రాజా సాబ్ పనుల్లోనే ఫుల్ బిజీగా ఉన్నారని మరో ఈ రెండు వారాల్లోనే టీజర్ రానున్నట్లు అసలు విషయం చెప్పేశారు. సో డార్లింగ్ ఫ్యాన్స్ ఇంకొక్క రెండు వారాలు ఓపిక పడితే సరిపోతుంది అని చెప్పాలి.