టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రం “విశ్వంభర” గురించి అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు ఉన్న ఈ చిత్రాన్ని దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తుండగా చాలా కాలం తర్వాత చిరు నుంచి ఒక స్ట్రైట్ సినిమా అలాగే ఫాంటసీ జానర్ లో వస్తుండడంతో అభిమానులు ఎగ్జైటెడ్ గా ఉన్నారు. అయితే ఈ సినిమాపై ఓ క్రేజీ న్యూస్ బయటకి వచ్చింది.
ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ సాంగ్ ని మెగాస్టార్ ఎంట్రీ సాంగ్ గా కీరవాణి కంపోజ్ చేసినట్టుగా మేకర్స్ ఇపుడు రివీల్ చేశారు. ఇక దీనిపై ఇచ్చిన పోస్టర్ అయితే అదుర్స్ అని చెప్పాల్సిందే. పక్కా మాస్ లుక్ లో దర్శనం ఇస్తూ చిరు తన అభిమానులకి ట్రీట్ ఇచ్చేలా ఉన్నారని చెప్పొచ్చు. మరి ఈ సాంగ్ ని శోభి మాస్టర్ కంపోజ్ చేస్తుండగా ఇందులో మంచి సర్ప్రైజ్ లు కూడా ఉంటాయని తెలుస్తుంది. మొత్తానికి మళ్ళీ మెగా ఫ్యాన్స్ లో విశ్వంభర కొత్త ఊపు తీసుకొస్తుంది అని చెప్పాలి.