మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ మూవీ ‘విశ్వంభర’ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో వెయిట్ చేస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు వశిష్ఠ డైరెక్ట్ చేస్తుండగా పూర్తి సోషియో ఫాంటసీ చిత్రంగా ఇది తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ ఈ మూవీపై అంచనాలను ఒక్కసారిగా పెంచేశాయి. అయితే, ఈ సినిమా విడుదల తేదీ మాత్రం ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వస్తోంది.
ఈ చిత్రాన్ని గతేడాది విడుదల చేస్తామని ప్రకటించిన చిత్ర యూనిట్ ఆ తర్వాత, జనవరి, మార్చి అంటూ విడుదల తేదీలను వాయిదా వేశారు. ఇక వేసవిలో ఈ చిత్రాన్ని ఎలాగైనా రిలీజ్ చేస్తారని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ, ఇప్పుడు ఈ సినిమాను వేసవిలో కాకుండా వేరొక తేదీన రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. చిరంజీవి కెరీర్‌లో ఐకానిక్ మూవీగా నిలిచిన ‘ఇంద్ర’ సినిమా విడుదల తేదీ అయిన జులై 24న ‘విశ్వంభర’ను విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించినట్లు తెలుస్తుంది.
ఇలా గతంలో ఇంద్రుడు వచ్చిన డేట్‌కు ఇప్పుడు విశ్వంభరుడు వస్తాడని.. రికార్డులను తిరగరాస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.