మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్నతాజా మూవీస్ లో డైరెక్టర్ వశిష్ట్ తెరకెక్కిస్తున్న తాజా ఫాంటసీ ఎంటర్‌టైనర్ ‘విశ్వంభర’కు ముందు నుంచే సినీ రంగంలో భారీ అంచనాలు ఉన్నాయి. మెగాస్టార్ చాలా సంవత్సరాల తరువాత చేస్తున్న డైరెక్ట్‌మూవీ కావడంతో పాటు ఆయన నటిస్తున్న ఫాంటసీ మూవీ కావడంతో అభిమానులు ఎంతో ఆత్రుత గా ఎదురు చూస్తున్నారు.
అయితే సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి కూడా చాలా ఆలస్యంగా షూటింగ్ జరుగుతోంది.దీంతో సినిమా ఎప్పుడు విడుదల కానుంది అనే దాని మీద క్లారిటీ లేదు. దానికి తగ్గట్లు ఇప్పుడు ఇంకో అనుమానం కూడా తెరమీదకు వచ్చింది. ‘విశ్వంభర’ ఈ ఏడాది కాకుండా వచ్చే ఏడాది ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తుంది.
ఇందుకు మెయిన్ రీజన్ గ్రాఫిక్స్ వర్క్ అని టాక్ వినపడుతుంది. భారీ స్థాయిలో ఉన్న విజువల్ ఎఫెక్ట్స్ ను మేకర్స్ చాలా కేర్ తో, ప్రతిష్టాత్మకంగా చేస్తున్నారని తెలుస్తోంది. అందుకే సినిమా ఆలస్యమవుతోందని సమాచారం. అయితే ఈ వార్త ఎంతవరకు నిజమో అధికారికంగా చెప్పాలి.