వారసుడిపై చిరంజీవి కామెంట్స్.. నెట్టింట విమర్శలు!

హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, రాజా గౌతమ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘బ్రహ్మా ఆనందం’ ఫిబ్రవరి 14న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఇక ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు చిత్ర యూనిట్. ఈ ఈవెంట్‌కు గెస్టుగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. 

ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి చేసిన కొన్ని కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట తెగ ట్రోలింగ్ అవుతున్నాయి. చిరు మాట్లాడుతూ.. ఇంట్లో మనవరాళ్లతో ఉన్నప్పుడు తనకు లేడీస్ హాస్టల్ వార్డెన్‌లా అనిపిస్తుందని.. తన కొడుకు రామ్ చరణ్‌కి మళ్లీ ఇంకో అమ్మాయి పుడుతుందేమో అని భయమని..

ఈసారి ఒక్క అబ్బాయిని కనాలని.. తమ లెగసీ కంటిన్యూ చేయాలని కోరుతున్నట్లు.. చిరు కామెంట్ చేశాడు. ఈ కామెంట్స్‌కు నెట్టింట తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. స్టార్ హీరో అయిన చిరంజీవి నోట ఇలాంటి వ్యాఖ్యలు రావడంపై నేషనల్ మీడియాలో సైతం విమర్శలు వస్తున్నాయి. మరి ఈ విమర్శలపై చిరు ఏమైనా స్పందిస్తాడా అనేది చూడాలి.

Related Posts

Comments

spot_img

Recent Stories