సాక్షి తప్పుడు కథనాలకు, చిన్నమ్మ ఘాటైన కౌంటర్!  

ఏది ఊహకు వస్తే అది రాసేయడం.. ఎలాంటి నిందలు వేయడానికైనా వెనకాడకపోవడం.. ఇవాళ్టి మీడియాలో ఒక ప్రధానమైన పోకడగా మారింది. ప్రతిక పుట్టుకలోనే రాజకీయ వక్ర ప్రయోజనాలే లక్ష్యంగా కలిగి ఉన్న సాక్షి దినపత్రిక.. అలాంటి వైఖరిలో మరెంత దూకుడుగా వ్యవహరిస్తుందో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఇలా విశాకలో డ్రగ్స్ కంటైనర్ వ్యవహారం వెలుగులోకి రాగానే, ఆ డ్రగ్స్ దందా వెనుక వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుల పాత్ర ఉన్నదని ప్రజలకు తెలియగానే.. ఎదురుదాడికి సర్వం దిగింది. ఆ ప్రయత్నాల్లో భాగంగానే.. దగ్గుబాటి పురందేశ్వరి కుటుంబానికి ముడిపెట్టే కుటిల ప్రయత్నం చేశారు. అలాంటి విషపూరితమైన ప్రచారానికి దగ్గుబాటి పురందేశ్వరి ఇప్పుడు ఘాటైన కౌంటర్ ఇస్తున్నారు. ఆ పత్రిక మీద 20 కోట్ల రూపాయలకు పరువునష్టం దావా వేయడానికి సిద్ధం అవుతున్నారు.

విశాఖ పోర్టులో దొరికిన 25 వేల కిలోల మాదకద్రవ్యం వ్యవహారానికి సంబంధించి తొలిరోజునుంచి సాక్షి దినపత్రికలో భిన్నమైన కథనాలు వచ్చాయి. బ్రెజిల్ నుంచి ఈ కంటైనర్ ను దిగుమతి చేసుకున్న సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్ వ్యాపారంలో దగ్గుబాటి పురందేశ్వరి కుటుంబం భాగస్వాములు అంటూ సాక్షి దినపత్రిక కథనాల్ని ప్రచురించింది.

నిజానికి దగ్గుబాటి పురందేశ్వరి వియ్యంకుడికి, సంధ్య ఆక్వా యజమాని వీరభద్రరావుకు కొన్నేళ్లకిందట వేరే  భాగస్వామ్యం వ్యాపారం ఉండేది. సంవత్సరాల కిందటే వారు విడిపోయారు. ఆ వ్యాపారం కూడా ఇప్పుడు లేదు. కానీ.. ఆ విషయాల్ని స్పష్టంగా చెప్పకుండా.. పురందేశ్వరి కుటుంబం ఇప్పటికీ వీరభద్రరావుతో వ్యాపార భాగస్వాములు అన్నట్టుగా సాక్షి ప్రచారానికి దిగింది.

తెలుగుదేశం పార్టీతో భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకున్న నాటినుంచి.. కమలం పెద్దలను ఏమీ అనలేక..

పురందేశ్వరిపై సాక్షి, వైఎస్సార్ కాంగ్రెస్ విషం కక్కుతున్న సంగతి అందరికీ తెలుసు. డ్రగ్స్ దందా బయటకు వచ్చేసరికి.. ఒక పాత పనికిరాని లింకు కనిపించే సరికి, పురందేశ్వరి కుటుంబంపై బురద చల్లడానికి సాక్షి ప్రయత్నించింది. దాన్ని సీరియస్ గా తీసుకున్న చిన్నమ్మ ఏకంగా 20 కోట్ల రూపాయల పరిహారానికి పరువునష్టం దావా వేయబోతున్నట్టుగా నోటీసులు పంపింది. రెండువారాల్లోగా వివరణ ఇవ్వకుంటే తదుపరి చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. మరి సాక్షి మెట్టు దిగి లెంపలు వేసుకుంటుందో లేదా, లీగల్ పోరాటానికి సిద్ధపడుతుందో చూడాలి. 

Related Posts

Comments

spot_img

Recent Stories