లేటెస్ట్ గా బాలీవుడ్ సినిమా దగ్గర రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో నటుడు విక్కీ కౌశల్ అలాగే రష్మిక మందన్న కలయికలో దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన భారీ చిత్రం “ఛావా” కూడా ఒకటి. ఛత్రపతి మహారాజ్ తనయుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా విక్కీ కౌశల్ కెరీర్లోనే సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని సాధించి అదరగొట్టింది. ఇలా డే 1 ఇండియా వైడ్ గా 33 కోట్లకి పైగా నెట్ వసూళ్లు అందుకున్న ఈ చిత్రం ఇపుడు డే 2 కూడా స్ట్రాంగ్ హోల్డ్ ని కనబరిచింది.
ఇలా డే 1 కంటే డే 2 మరింత బెటర్ వసూళ్లు నమోదు చేస్తున్నట్టుగా బాలీవుడ్ పి ఆర్ చెబుతున్నారు. మరి డే 2 కి 39.3 కోట్ల నెట్ వసూళ్లు అందుకుంది. దీనితో ఒక్క ఇండియా లోనే ఈ సినిమా మూడు రోజుల్లో 100 కోట్ల మార్క్ ని అందుకుంటుంది అని ఇపుడు కన్ఫర్మ్ అయ్యిపోయింది. ఈ ఆదివారం ఎలాగో మరింత బెటర్ వసూళ్లు రిజిస్టర్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి చూడాలి ఛావా మూడో రోజు వసూళ్లు ఎలా ఉంటాయి అనేది.