వైఎస్ జగన్‌పై ఉడికిపోతున్న చెవిరెడ్డి వర్గీయులు!

జగన్మోహన్ రెడ్డికి ఆయన పార్టీలో అత్యంత ఆత్మీయులు, విశ్వసనీయులు అయిన నాయకుల్లో చెవిరెడ్డి భాస్కర రెడ్డి కూడా ఒకరు. ఆయన ప్రస్తుతం లిక్కర్ కుంభకోణం కేసులో రిమాండులో ఉన్నారు. తనకు ఏపాపం తెలియదని, దేవుడి మీద ప్రమాణం చేసి చెబుతానని ప్రతిసారీ మొత్తుకుంటున్న చెవిరెడ్డి అరెస్టు అయి ఇప్పటికి అనేక వారాలు గడిచాయి. అయినా ఇప్పటిదాకా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయనను పరామర్శించడానికి ములాఖత్ కు వెళ్లనే లేదు. కానీ.. చెవిరెడ్డి తర్వాత చాలా కాలానికి అరెస్టు అయిన ఎంపీ మిథున్ రెడ్డిని మాత్రం పరామర్శించడానికి రాజమహేంద్రవరం జైలుకు వెళుతున్నారు. జగన్ మోహన్ రెడ్డి తమ నాయకుడి పట్ల చూపిస్తున్న వివక్షను గమనించి.. చెవిరెడ్డి భాస్కర రెడ్డి వర్గీయులు ఆగ్రహంతో ఊగిపోతున్నట్టుగా పార్టీ వర్గాలలో చర్చ జరుగుతోంది.

ఇప్పటిదాకా లిక్కర్ కేసులో అరెస్టు అయిన నిందితుల్లో ఏ ఒక్కిరనీ పరామర్శించడానికి జగన్ ములాఖత్ కు వెళ్లనేలేదు. అరెస్టు అయిన అనేకమంది అసలు జగన్ కు తెలియకపోవచ్చు. వారంతా వసూళ్ల నెట్ వర్క్ కింగ్ పిన్ రాజ్ కెసిరెడ్డి మనుషులు. వారి విషయం పక్కన పెడితే.. తన పురమాయింపు మేరకు, తన సొంత ఖజానాను నింపుకోవడానికి దాదాపు మూడున్నర వేల కోట్ల రూపాయలను ఒక ప్రణాళిక ప్రకారం డిస్టిలరీల యజమానుల నుంచి వసూలు చేసి పెట్టిన కీలక వ్యక్తి రాజ్ కెసిరెడ్డి అరెస్టు అయిన తర్వాత కూడా జగన్ తన కోటనుంచి అడుగు బయటపెట్టలేదు. అంతే కాదు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఎవరైతే.. సీఎం తీసుకునే నిర్ణయాలన్నిటినీ తీసుకునే వారో వారికి కూడా గతి లేదు. అప్పట్లో మంత్రులైనా సరే.. సీఎం దగ్గరకు వెళితే.. ‘వెళ్లి ధనంజయ్ అన్నని కలవండన్నా’ అని చెప్పేవాడని ప్రతీతి. అంతగా చక్రం తిప్పిన అధికారులు ధనంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, వైఎస్ భారతికి ఆర్థిక సలహాదారు గోవిందప్ప బాలాజీ లు అరెస్టు అయినప్పుడు కూడా జగన్ వెళ్లలేదు. కానీ వారందరి సంగతి వేరు. తమ నాయకుడు చెవిరెడ్డి భాస్కర రెడ్డి సంగతి వేరు అని ఆయన అభిమానులు బాధపడుతున్నారు.చెవిరెడ్డి – జగన్ కోసం ఎన్నెన్నో త్యాగాలు చేశారని వ

Related Posts

Comments

spot_img

Recent Stories