జగన్ డ్రామాకు చెక్ : కేబినెట్ తాజా నిర్ణయం!

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో గ్రామాల్లోని ప్రజలందరికీ ఇళ్లవద్దకే రేషన్ సరుకులు సరఫరా చేస్తున్నట్టుగా ఒక సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఇంటింటికీ తిరిగి సరుకులు అందజేయడానికి వందల సంఖ్యలో వాహనాలను కూడా కొనుగోలు చేశారు. వాహనాల కొనుగోలు పర్వంలోనే పెద్ద దందా నడిచిందని, ఆ దందాకోసమే అన్ని వాహనాలు పార్టీ రంగులతో కొన్నారని అనేక ఆరోపణలు అప్పట్లోనే వినిపించాయి. కానీ వాహనాల ద్వారా రేషన్ సరుకుల పంపిణీ అనే ముసుగులోనే అనేక అక్రమాలు చోటు చేసుకుంటున్నట్టుగా తర్వాత్తర్వాత వెలుగులోకి వచ్చింది. కేవలం ఈ అక్రమాలను అరికట్టే ఉద్దేశంతో మాత్రమే కాకుండా.. రేషన్ పంపిణీ రోజుల్లో తప్ప మిగిలిన నెలపొడవునా నిరుపయోగంగా పడిఉంటున్న వాహనాల ద్వారా ఉపయోగం లేదని గ్రహించి.. పూర్వ పద్ధతిలో రేషన్ దుకాణాల ద్వారా బియ్యం ఇతర సరుకుల పంపిణీ జరగాలని చంద్రబాబునాయుడు కేబినెట్ నిర్వహించింది.

అయితే ఈ నిర్ణయంలో కూడా చంద్రబాబు తీసుకున్న అతిగొప్ప సవరణ ఏంటంటే.. వృద్ధులు, వికలాంగులకు మాత్రం ఇళ్ల వద్దకే రేషన్ పంపే ఏర్పాటుచూడాలని నిర్ణయించారు. మిగిలిన వారు మాత్రం రేషన్ దుకాణాలకు వచ్చి తీసుకోవాల్సి వుంటుంది. దీనివల్ల.. రేషన్ వాహనం వచ్చేరోజున అన్ని పనులు మానుకుని ఇంటిపట్టునే ఉండాలనే ఇబ్బందిని పక్కకు పెట్టి ప్రజలు తమకు వీలు కుదిరిన వేళల్లో దుకాణం వద్దకు వెళ్లి నెలపొడవునా ఎప్పుడైనా తెచ్చుకునే వెసులుబాటు ఉంటుందని చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకోసం మంచి ఆలోచన చేసినట్టుగా హర్షం వ్యక్తం అవుతోంది.

జగన్ పరిపాలన కాలంలో.. రేషన్ వాహనాల ద్వారా ఇళ్ల వద్దనే ఇచ్చేవారు. ఆ ముసుగులో నాలుగురోజులు ఇచ్చి ఆ సమయంలో ఇళ్ల వద్ద లేని వారికి పూర్తిగా ఎగ్గొట్టేవారు. ఇది పనుల మీద కుటుంబం మొత్తం కూలికి వెళ్లే కూలివారికి చాలా ఇబ్బందికరంగా ఉండేది. అంతకంటె పెద్ద ఘోరం ఏంటంటే.. జగన్ ప్రభుత్వ కాలంలో ఆయన పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల సహకారంతో రేషన్ బియ్యాన్ని విదేశాలకు స్మగ్లింగ్ చేసేవారని పెద్దస్థాయిలో ఆరోపణలున్నాయి. రేషన్ బియ్యం స్మగ్లింగ్ ద్వారా వేలకోట్లు ఆర్జించిన వారున్నారు. అలాంటి వారు స్మగ్లింగ్ చేస్తున్న రేషన్ బియ్యం బస్తాలను తరలించడానికి ఇదే వాహనాలను వాడేవారు. ఇవి రేషన్ వాహనాలే గనుక.. స్మగ్లింగ్ అనే అనుమానం రాకుండా తరలించేసేవారు. ఇలాంటి సకల అక్రమాలు, అరాచకాలకు చెక్ పెట్టే ఉద్దేశంతో చంద్రబాబునాయుడు గతంలో మాదిరిగా గ్రామస్తులందరికీ రేషన్ దుకాణాల వద్దనే నెలపొడవునా సరుకులు ఇచ్చే ఏర్పాటుచేస్తున్నారు. ఈ మేరకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories