టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ లో పాన్ ఇండియా లెవెల్లో తనదైన ముద్ర వేసిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా ఒకరు. మరి సూపర్ జానర్ లో పలు భారీ సినిమాలు అందిస్తున్న తాను తన సినిమాటిక్ యూనివర్స్ ని ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి ఈ యూనివర్స్ లో భాగంగా పలు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే. అలా చేస్తున్న భారీ సినిమానే ‘మహాకాళీ’.
అయితే ఈ సినిమాలో లేటెస్ట్ గా ప్రముఖ టాలెంటెడ్ నటుడు అక్షయే ఖన్నా చేరినట్టుగా క్లారిటీ వచ్చింది. ఈ నటుడు ఇటీవల బాలీవుడ్ భారీ హిట్ చిత్రం ఛావా సినిమాలో విలన్ ఔరంగజేబుగా చేసి అందరినీ ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. మరి ఇలాంటి నటుడు ఇపుడు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లోకి చేరడం మరో విశేషం. మరి ఈ సినిమాలో తాను ఎలాంటి పాత్ర చేయనున్నారో చూడాలి మరి. ఇక ఈ చిత్రానికి ఆర్ కే డి స్టూడియోస్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.