బాలీవుడ్ టాలెంటెడ్ హీరో విక్కీ కౌశల్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన భారీ హిస్టారికల్ హిట్ చిత్రం “ఛావా” కోసం అందరికీ తెలిసిందే. బాలీవుడ్ లో ఈ ఏడాదికి భారీ హిట్ గా నిలిచిన ఈ చిత్రం అక్కడ అనేక రికార్డులు తిరగరాయడమే కాకుండా ఎమోషనల్ గా కూడా దేశ వ్యాప్తంగా ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. ఇక ఇలా ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న ఈ చిత్రం ఎట్టకేలకి ఓటిటిలో కి వచ్చేసింది.
ఈ సినిమా హక్కులు దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ తీసుకోగా అందులో నేటి నుంచి వచ్చేసింది కానీ అనుకున్నదే జరిగింది. ఈ చిత్రం కేవలం హిందీలో మాత్రమే నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చింది. థియేట్రికల్ గా మన తెలుగులో కూడా వచ్చినప్పటికీ ఓటిటిలో చాలా మంది పాన్ ఇండియా భాషల్లో ఎదురు చూసారు. కానీ ఈ సినిమా కేవలం హిందీలో మాత్రమే వచ్చి రీజనల్ ఆడియెన్స్ ని నిరాశ పరిచింది. మరి నెట్ ఫ్లిక్స్ ఏమన్నా దీనిని ఇతర భాషల్లో కూడా తీసుకొస్తారో లేదో అనేది వేచి చూడాలి.