చరణ్‌ భారీ కటౌట్‌ అదిరింది!

చరణ్‌ భారీ కటౌట్‌ అదిరింది! డైరెక్టర్‌ శంకర్ – రామ్ చరణ్ కాంబోలో రాబోతున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ ‘గేమ్ ఛేంజర్’. జనవరి 10, 2025న ఈ సినిమా థియేటర్లలోకి విడుదల కానుంది. ఈ పొలిటికల్ డ్రామా పై మెగా అభిమానుల్లో ఇప్పటికే భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.

అయితే, ఈ సినిమా విడుదలను పురస్కరించుకొని విజయవాడ బృందావన కాలనీలోని వజ్రా మైదానంలో 256 అడుగుల భారీ కటౌట్ రెడీ చేశారు. ఇంత భారీ స్థాయిలో కటౌట్‌ పెట్టడం ఇదే తొలిసారి అని.. ఇది తమకెంతో ప్రత్యేకమని మెగా అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. రామ్‌ చరణ్‌ యువశక్తి ఆధ్వర్యంలో దీనిని ఏర్పాటు చేసినట్లు వారు తెలియజేశారు.కాగా ఈ భారీ కటౌట్ పెట్టడానికి దాదాపు వారం రోజులు శ్రమించారట. చెన్నై నుంచి వచ్చిన ప్రత్యేక బృందం ఈ నిర్మాణంలో భాగమైందట. మొత్తానికి చరణ్ అభిమానులు సరికొత్తగా ఆలోచించారు. కాగా ఈ సినిమాలో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. మరో కీలక పాత్రలో అంజలి కనిపించనుంది. 

Related Posts

Comments

spot_img

Recent Stories