ఆ డైరెక్టర్‌ తో చరణ్‌ సినిమా..కన్ఫార్మ్‌!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ‘పెద్ది’ అనే సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ తర్వాత కూడా చరణ్ తన తదుపరి సినిమాల ప్లాన్‌ని స్పీడ్‌గా ముందుకు తీసుకెళ్తున్నాడు. తాజాగా ఆయన మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్ వినిపిస్తుంది.

ఈసారి మాటల మాంత్రికుడిగా పేరుగాంచిన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా చేయబోతున్నట్టు సమాచారం. గతంలో వీరి కాంబినేషన్‌లో ఓ సినిమా అనౌన్స్‌ అయ్యే అవకాశం వచ్చినా, కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లలేదు. ఇప్పుడు మాత్రం త్రివిక్రమ్ సినిమాను చరణ్ లైన్‌లో పెట్టినట్టు ఫిల్మ్ సర్కిల్ లో చర్చ నడుస్తోంది.

త్రివిక్రమ్ స్టైల్ స్క్రీన్‌ప్లే, ఆయనకు స్పెషల్‌గా ఉండే డైలాగ్స్, చరణ్ ఇమేజ్‌కు ఎంత వర్కౌట్ అవుతాయో అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ కాంబో వర్క్‌ అవుట్ అయితే, ఇది చరణ్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవొచ్చని చెప్పవచ్చు. ప్రస్తుతం ప్రాజెక్ట్ అధికారికంగా అనౌన్స్ కాకపోయినా, ఈ క్రేజీ కలయికపై ఇండస్ట్రీలో మంచి బజ్ మొదలైంది.  

Related Posts

Comments

spot_img

Recent Stories