బ్రేక్ తీసుకున్న చరణ్-సుక్కు! లేటెస్ట్ గా పాన్ ఇండియా వైడ్ ఇండస్ట్రీ హిట్ కొట్టిన దర్శకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది దర్శకుడు సుకుమార్ అనే చెప్పాలి. తన భారీ హిట్ చిత్రం పుష్ప 2 సంచలన విజయం సాధించి 1870 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకుంది. అయితే ఈ సినిమా తర్వాత సుకుమార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో ఓ భారీ సినిమా కన్ఫర్మ్ చేసుకున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ కూడా సుకుమార్ ముగించే పనిలో ఉన్నారు. అయితే దీని నుంచి ఇపుడు చిన్న బ్రేక్ తీసుకున్నారని చెప్పాలి. లేటెస్ట్ గా జరిగిన భారత్, పాకిస్తాన్ మ్యాచ్ వీక్షించేందుకు కుటుంబంతో కలిసి సుకుమార్ పయనం అయ్యారు. అలాగే చిన్నపాటి హాలిడే ఎంజాయ్ చేసాక మళ్ళీ చరణ్ సినిమాకి రంగంలో దిగనున్నారని తెలుస్తుంది. మరి రామ్ చరణ్ కెరీర్లో రంగస్థలం లాంటి మాస్టర్ పీస్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ కలయిక పట్ల అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. మరి ఈసారి సుకుమార్ కొట్టే రీసౌండ్ ఎక్కడ వరకు వినిపిస్తుందో చూడాలి.