ఏనీ టైమ్ రెడీ అంటున్న చరణ్! గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. RC16 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ సరికొత్త మేకోవర్‌తో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు.
ఇక ఈ సినిమాను పూర్తి స్పోర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్‌తో రూపొందిస్తున్నారు చిత్ర యూనిట్. ఇక ఈ సినిమా తర్వాత చరణ్ తన సినిమాలను ఇప్పటికే ఫైనల్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట. దర్శకుడు సుకుమార్‌తో ఓ సినిమా చేయనున్న చరణ్, ఓ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్‌కు తనతో సినిమా చేసేందుకు రెడీగా ఉన్నట్లు తెలిపాడట. ప్రముఖ నిర్మాత మధు మంటేనాకు రామ్ చరణ్‌తో మంచి బాండింగ్ ఉంది.
చరణ్ ఎప్పుడు ముంబై వెళ్లినా, అక్కడ ఆయన బాగోగులు చూసుకునేది ఈ నిర్మాతే. దీంతో తనతో సినిమా చేసేందుకు మధు మంటేనాకు చరణ్ ఛాన్స్ ఇచ్చాడని.. ఎప్పుడైనా మంచి కథ దొరికితే వెంటనే ఆయనతో సినిమాకు రెడీ అన్నట్లు చరణ్ చెప్పినట్లు బాలీవుడ్ మీడియా చెబుతోంది. మరి నిజంగానే ఈ ప్రొడ్యూసర్‌కు రామ్ చరణ్ ఇలాంటి అవకాశం ఇచ్చాడా అనేది వేచి చూడాలి.