తెలుగు చిత్ర పరిశ్రమలోకి లవ్ ఫెయిల్యూర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అమలాపాల్. తెలుగు, తమిళం భాషాల్లో స్టార్ హీరోలతో నటించి దర్శకుడు విజయ్ ని పెళ్లి చేసుకుని కొంత కాలానికే విడిపోయింది. ఆ తరువాత జగత్ దేశాయ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.
వీరిద్దరికీ సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటు ఉంటుంది. తాజాగా అమలాపాల్ ఓ క్రేజీ విషయాన్ని అభిమానులతో పంచుకుంది. అది ఏంటంటే అమలాపాల్ త్వరలోనే కవల పిల్లలకు జన్మనిస్తున్నట్లు తెలిపింది. ఈ విషయానికి సంబంధించి ఓ చిన్న పాపని ఎత్తుకొని టూ హ్యాపీ కిడ్స్ అంటూ క్యాప్షన్ పోస్ట్ చేసింది.
అమలాపాల్ గర్భవతిగా ఉండడంతో అతి త్వరలోనే ఆమె ఇద్దరు కవల పిల్లలకు జన్మనివ్వబోతున్నట్లు నెటిజన్లు భావిస్తున్నారు. అసలు ఆమె ఈ విషయం పోస్టు పెట్టడంతో ఆమె నిజంగా కవల పిల్లలకు జన్మినిస్తుందా లేక మరేదైనా విశేషం ఉందా అంటూ కామెంట్లు పెడుతున్నారు.