చరణ్ కు ఇండియాలోనే అతిపెద్ద కటౌట్

కోలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ శంకర్,  గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమా సంక్రాంతి కానుకగా వచ్చే జనవరి 10న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. సుమారు 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ సోలో హీరోగా చరణ్ యాక్ట్‌ చేస్తున్న సినిమా కావడంతో మెగా ఫ్యాన్స్ అంతా  ‘గేమ్ ఛేంజర్’ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికే చిత్ర బృందం విడుదల  చేసిన టీజర్, సాంగ్స్ కి ఆడియన్స్ నుంచి అనూహ్య స్పందన వచ్చింది. విడుదల సమయం దగ్గరపడటంతో మేకర్స్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచింది మూవీ టీమ్‌.  ఇందులో భాగంగా  రామ్ చ‌ర‌ణ్ ఓ అరుదైన‌ ఫీట్‌ను అందుకుంటున్నట్లు సమాచారం. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ కోసం డిసెంబ‌ర్ 29న‌ దేశంలోనే అతిపెద్ద రామ్ చ‌ర‌ణ్ క‌టౌట్‌ను ఆవిష్కరించబోతున్నారు.

విజయవాడ బృందావన్ కాలనీలో ఉన్న వజ్రా గ్రౌండ్స్‌లో సాయంత్రం 4 గంటలకు రామ్ చరణ్ భారీ క‌టౌట్‌ను ఆవిష్కరించబోతున్నారు. సుమారు 250 అడుగులు ఉండే ఈ కటౌట్ ఈవెంట్ ను సైతం గ్రాండ్ గా ప్లాన్ చేశారు. మెగా అభిమానుల సమక్షంలోనే ఈ కటౌట్ ఓపెనింగ్ ఉండబోతోంది. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. 

Related Posts

Comments

spot_img

Recent Stories