టాలీవుడ్ కి పరిచయం అక్కర్లేని పేరు రామ్ చరణ్ తేజ్… ఆయన సినిమాలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో..కుటుంబానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు. ఈ విషయాన్ని ఆయన అనేక సందర్భాల్లో ప్రూఫ్ చేశారు కూడా. ఏ మాత్రం ఖాళీ దొరికిన వెంటనే కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లిపోతుంటారు.
ఈ క్రమంలోనే తాజాగా చరణ్ తన భార్య ఉపాసన, కుమార్తె క్లీంకారతో కలిసి థాయ్ లాండ్ వెకేషన్ కు వెళ్లాడు. అక్కడ నుంచి తిరిగి వచ్చిన తరువాత మెగా కోడలు అక్కడి ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. ప్రస్తుతం అవి నెట్టింట్లో వైరల్ గా మారాయి.. చరన్ , ఉపాసన్ క్లీంకారతో కలిసి ఏనుగుకు పిల్లకు స్నానాన్ని చేపిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఉపాసన తన పెంపుకు కుక్క రైమ్ అధికారిక ఇన్ స్టా ఖాతా నుంచి కూడా కొన్ని ఫోటోలను పంచుకుంది. అందులో రైమ్ అభిమానులతో కొన్ని వ్యాఖ్యాలు చెప్పినట్లుగా… ” థ్యాంక్యూ నానా… నా సోదరి క్లీన్ కారాతో కలిసి ఈ చల్లటి స్యామ్యూయ్ వాతావరణాన్ని నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను. సముద్రంలో ఈత కొట్టడం, ఏనుగుల స్నానాలు, వాటి సంరక్షణ గురించి తెలుసుకోవడంతో పాటు మరెన్నో ఇష్టమైన పనులను చేశాను.” అంటూ రైమ్ చెప్పుకొచ్చింది.